అత్తివరదరాజ స్వామి ఆలయ ఆదాయం ఇంతా!
Editor | 21 Aug 2019 9:34 PM GMT
40 ఏళ్లకు ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే కాంచిపురంలోని అత్తివరద రాజస్వామి ఆలయానికి భారీగానే ఆదాయం వచ్చింది. ఈనెల 17తో స్వామి ఉత్సవాలు ముగియడంతో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. నగదు రూ. 9.90 కోట్లు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చాయని అధికారులు తెలిపారు.ఆలయంలో మొత్తం 18 హుండీలను ఏర్పాటు చేశారు. వీటిలో 13 హుండీలను మాత్రమే లెక్కించిన అధికారులు మిగితా వాటిని కూడా లెక్కించే పనిలో ఉన్నారు.
గత నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 17తో ముగిశాయి. తొమ్మిది అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం 38 రోజులు శయనిస్తూ..10 రోజులు నిలబడి దర్శనమిచ్చాడు. ఈనెల 17న రాత్రి జలావాసంలోకి వెళ్లారు. మళ్లీ తిరిగి స్వామివారు 2059లో అంటే మరో 40 ఏళ్ల తర్వాతనే దర్శనం ఇవ్వనున్నారు.
Updated : 21 Aug 2019 9:34 PM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire