నాటు నాటు పాటని రీక్రియేట్ చేసి యూట్యూబ్ లో పాపులర్ అయ్యాడు నటుడు చంద్రహాస్. బుల్లితెర మెగాస్టార్ గా పేరు గాంచిన ఈటీవి ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. ఒక్క సినిమా చేయకుండానే సెట్ అయిపోయిన హీరోల క్రేజ్ దక్కించుకున్నాడు. దీనికి కారణం చంద్రహాస్ పై ట్రోల్స్. ట్రోలర్స్ విరుచుకుపడడంతో తెలుగు రాష్ట్రాల్లో యాటిట్యూడ్ స్టార్ అన్న పేరు మారు మ్రోగిపోయింది. 2022 సెప్టెంబర్ 16..న తన కుమారుడు చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి హీరోగా పరిచయం చేశారు ప్రభాకర్.
ఆ ఈవెంట్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ వివాదాస్పదం అయింది. అతని హావభావాలు కాస్త తేడా కొట్టడంతో ట్రోలర్స్ కి మంచి కంటెంట్ దొరికినట్లయింది. దాంతో ఇంకేముంది వరుసగా చంద్రహాస్ పై ట్రోల్స్. అయితే మధ్యలో ప్రభాకర్ స్పందించినా ఇప్పటివరకు ట్రోల్స్ పై కామెంట్స్ చేయలేదు చంద్రహాస్. తొలిసారి తనపై జరుగుతున్న నెగిటీవ్ ట్రోలింగ్ గురించి రియాక్ట్ అయ్యాడు. సంక్రాంతి సందర్భంగా సుడిగాలి సుధీర్ చేసిన ఒక ఈవెంట్ లో తండ్రి ప్రభాకర్ తో కలిసి చంద్రహాస్ పాల్గొన్నాడు.
రజినీకాంత్, రణ్వీర్ సింగ్ హిట్ సాంగ్స్ కి అద్దిరిపోయే మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చంద్రహాస్. తండ్రితో కలిసి చంద్రహాస్ రజిని కాంత్ పేట పాటకి వేసిన స్టెప్స్ హైలైట్ అని చెప్పొచ్చు. మంచి స్కిల్స్ ఉన్న హీరోగా కనిపించాడు. ఇదే ఈవెంట్లో తన ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యాడు చంద్రహాస్. ఈ సంక్రాంతి ఈవెంట్ లో పాల్గొన్న ముక్కు అవినాష్ అనే కమెడియన్ చంద్రహాస్ ని ట్రోల్స్ పై స్పందించాల్సిందిగా కోరాడు.
మిమ్మల్ని ఇంత దారుణంగా ట్రోల్ చేశారు కదా మీకు బాధ కలగలేదా? అని ప్రశ్నించగా.. చంద్రహాస్ సమాధానం ఇస్తూ..” నేను ఆ రోజు కావాలని అలా చేసింది కాదు. ఆ ప్రెస్ మీట్ లో దాదాపు 30 కెమెరాలు ఉన్నాయి. పైగా మా నాన్న నన్ను పొగుడుతుంటే.. నాకు నవ్వు వస్తోంది. దాంతో నేను అక్కడ నవ్వు ఆపుకోడానికి ట్రై చేశాను. అది చూసే వారికి యాటిట్యూడ్ లాగా కనిపించింది. మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల అలా అయ్యింది” అని తనపై ట్రోల్స్ కు సమాధనం చెప్పాడు చంద్రహాస్. అయితే ఈ ట్రోల్స్ గురించి మా అమ్మ చాలా ఫీల్ అయ్యింది. నేను మాత్రం లైట్ తీసుకోమని చెప్పాను అని చంద్రహాస్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
విలేకరిపై త్రివిక్రమ్ ఫ్రెండ్ నాగవంశీ సూపర్ కౌంటర్..!
తారకరత్న సంచలన రికార్డు.. ప్రపంచంలో ఏ హీరో టచ్ చేయలేని ట్రాక్ రికార్డు..!
మూడున్నర ఏళ్ళకు.. ‘సువర్ణ సుందరి’కి మోక్షం ..!