కాళ్లు విరిచేస్తానని వైసీపీ ఎంపీటీసీని బెదిరించిన మంత్రి కుమారుడి ఆడియో - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్లు విరిచేస్తానని వైసీపీ ఎంపీటీసీని బెదిరించిన మంత్రి కుమారుడి ఆడియో

June 2, 2022

కోనసీమ జిల్లా పేరు మార్పు సందర్భంగా జరిగిన అల్లర్లలో పోలీసులు ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుపై కేసు నమోదు చేశారు. అంతకు ముందు మంత్రి విశ్వరూప్ ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టిన విషయం తెలిసిందే. దీంతో విశ్వరూప్ కుమారుడు కృష్ణా రెడ్డి సదరు ఎంపీటీసీ సత్తిబాబుకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. మా ఇంటినే తగులబెడతారా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. రెండు కాళ్లు విరిచేస్తా.. నీ సంగతి చూస్తానంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆడియోను మీరూ వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.