‘పుష్ప 2’ కి నటీనటులు కావలెను.. ఆసక్తి ఉంటే ఆడిషన్స్‌కి రండి - MicTv.in - Telugu News
mictv telugu

‘పుష్ప 2’ కి నటీనటులు కావలెను.. ఆసక్తి ఉంటే ఆడిషన్స్‌కి రండి

July 1, 2022

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన పుష్ప చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. కలెక్షన్లలో దుమ్ము రేపింది. ఇప్పుడు పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సీక్వెల్ కోసం సుకుమార్ ఓ రేంజులో డిజైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాకు కొత్త నటీనటుల కోసం మూవీ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. అన్ని వయసుల వారు ఆడ, మగ తేడా లేకుండా ఆడిషన్‌కి రావాలని తెలిపారు. ఈ నెల 3,4,5 తేదీలలో తిరుపతిలోని న్యూ బాలాజీ నగర్‌లోని మేక్ మై బేబీ జీనియస్ స్కూలులో ఆడిషన్స్ జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరుకావాలని సూచించారు. అయితే ఒక కండీషన్. చిత్తూరు యాస మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ మేరకు పుష్ప పేరుతో ట్విట్టర్‌లో వివరాలను షేర్ చేశారు. కాగా, పుష్ప సినిమా మొత్తం చిత్తూరు యాసలో ఉండడం తెలిసిందే. అల్లు అర్జున్‌తో పాటు అన్ని పాత్రలు అదే యాసలో మాట్లాడతాయి. తెలంగాణకు చెందిన వరంగల్ కుర్రాడు కేశవ పాత్రలో అదరగొట్టాడు. కావున యాసకు ప్రాంతీయ భేదాలు కూడా లేవు. మీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు.