ఈ పోస్టింగ్ గురించి అస్సలు రాయోద్దన్పించింది….. అయితే రాయక తప్పలేదు. కానీ ఒక్కో సారి తెల్వి మీరితే…. ఏం చేస్తున్నారో వాళ్లకు కూడా తెలియదు. సరిగ్గా అలాంటి పనిచేశారు హర్యానా బిజెపి నాయకులు విజేత మాలిక్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హిందుల పై జరుగుతున్న దాడుల గురించి అస్సలు పట్టించుకోవడం లేదంటూ తన ఫేస్ బుక్ పేజీలో ఓ ఫోటో పెట్టారు. ఆ ఫోటోనే పెద్ద వివాదానికి కారణం అయింది. అంతే కాదు నెటిజిన్ల ఆగ్రహానికీ గురైంది.
తన ఫేసు బుక్ పేజీలో భోజ్ పురి సిన్మా ‘‘ఔరత్ ఖిలోనా నహీ’’ సిన్మాలోని ఓ స్టిల్ ను పోస్టు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆస్టిల్… చాలా అభ్యంతర కరంగా ఉందంటున్నారు నెటిజన్లు. అందరూ చూస్తండగానే ఓ రాజకీయ నాయకుడు మహిళ చీర లాగుతున్నట్లు ఆఫోటో ఉంది. ఇది మహిళలను కించ పర్చేలా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆమె పై కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు జనాలు.
అయితే ఆమె పెట్టిన ఆ ఫోటోలో చీర లాగుతున్న వ్యక్తి బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారి నటించిన సినిమాలోనేదే కావడం కొసమెరుపు. అందుకే పోస్టింగ్ లు పెట్టేటప్పుడు కాస్త వెనుకా ముందు చూసుకుని పెడితే బావుంటుంది.