వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో ఆస్ట్రేలియే భారీ స్కోర్ సాధించింది. 152.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 598 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది. లబూషేన్, స్టీవ్ స్మిత్‌లు డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 251 పరుగులు చేశారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5) మాత్రమే విఫలం కాగా.. ఉస్మాన్ ఖవాజా 65 పరుగులు చేయగా.. ట్రావిస్ హెడ్ 99 పరుగుల వద్ద ఔట్ కాగానే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.కె.బ్రాత్‌వైట్(18), టి.చంద్రపాల్ (47) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కెరీర్లో 29వ సెంచరీ సాధించిన స్మిత్..డాన్ బ్రాడ్‌మెన్ సమం చేశాడు. టెస్టుల్లో 29 సెంచరీలు సాధించిన బ్రాడ్‌మన్ సరసన చేరాడు. బ్రాడ్‌మన్ కేవలం 52 టెస్టుల్లో ఈ ఘనత అందుకుంటే.. స్మిత్ 88 టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రిక్కీ పాంటింగ్ (41) తొలి స్థానంలో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హెడెన్ (30) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
29 x 💯
Steve Smith showing no signs of slowing down! #MilestoneMoments#AUSvWI | @nrmainsurance pic.twitter.com/ebkgO2j8n5
— cricket.com.au (@cricketcomau) December 1, 2022
ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఏడు డబుల్ సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉండగా.. జో రూట్ 5 డబుల్ సెంచరీలు, స్మిత్, విలియమ్సన్ తలో 4 డబుల్ సెంచరీలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు డాన్ బ్రాడ్‌మన్ (12) పేరిట ఉంది. ఇక పెర్త్ టెస్టులో చెలరేగిన స్మిత్ సగటు టెస్టుల్లో 61 దాటింది. ప్రస్తుత తరం క్రికెటర్లో మరే ఆటగాడు కూడా టెస్టు యావరేజ్ విషయంలో స్మిత్‌కు చేరువగా లేకపోవడం గమనార్హం. టెస్టుల్లో వెస్టిండీస్ జట్టుపై స్మిత్, లబూషేన్ యావరేజ్ 200కిపైగా ఉండటం విశేషం.