మహిళల టీ20 ప్రపంచ కప్‌లో తమకు ఎదురులేదని కంగారులు మరోసారి చాటి చెప్పారు. వరుసుగా మూడో టీ20 ప్రపంచ కప్ దక్కించుకొని హ్యాట్రిక్ సాధించింది ఆస్ట్రేలియా. చరిత్ర సృష్టిసారనుకున్న సఫారీలు.. ఆసీస్ ముందు తలవంచక తప్పలేదు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం అందుకుంది. ఆరోసారి ప్రపంచకప్ ముద్దాడి చరిత్ర సృష్టించింది. టీ20లో మొదటి వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికా చివరి ఓరకు పోరాడిన ఓటమి తప్పలేదు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 రన్స్ స్కోర్ చేసింది. బేత్ మూనీ అర్థ సెంచరీ (74 నాటౌట్)తో చెలరేగగా, గార్డినెర్ 29 పరుగులతో రాణించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్నే కాప్, షబ్నిం ఇస్మాయిల్ రెండు వికెట్లు తీశారు. నన్కులులెకో లబా, ట్రయాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.157 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 137 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ఓపెనర్ లారా వొల్వార్డ్ 48 బంతుల్లో 61 చెలరేగి ఆడిన మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఫలితం లేకుండా పోయింది. చివరకు సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలవాలి అనుకున్న దక్షిణాఫ్రికాకు నిరాశే మిగిలింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్ బేత్ మూన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.