Home > Featured > గ్లాస్ బీరు ధర చూస్తే కిక్కు దిగాల్సిందే..!

గ్లాస్ బీరు ధర చూస్తే కిక్కు దిగాల్సిందే..!

ఒక్క గ్లాస్ బీరు తాగితే మహా అయితే వందల్లో బిల్లు వేస్తారు. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఓ వ్యక్తికి వేసిన బిల్లు చూస్తే మత్తు దిగాల్సిందే. అమెరికన్ బ్రాండ్ బీరు తాగిన ఆ వ్యక్తి నుంచి ఏకంగా రూ. 73 లక్షల బిల్లు వసూలు చేశారు. తనకు ఎదురైనా ఈ విషయాన్నిపీటర్ లాలర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తాను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బీరు తాగానంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఓ మ్యాగజైన్‌లో క్రీడా కాలమిస్ట్‌గా పనిచేస్తున్న పీటర్ లాల్ మాంచెస్టర్ లోని ఓ హోటల్‌లో గ్లాసు బీరు తాగాడు. దానికి బిల్లు తన డెబిట్ కార్డు ద్వారా చెల్లించారు. బిల్లు వచ్చిన తర్వాత చూసుకుంటే దానిపై రూ. 73 లక్షలని తేలింది. వెంటనే అతనికి బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్‌లో తన ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయినట్టు వచ్చింది. కంగుతిన్న అతను బిల్లు ఎంతా అని ప్రశ్నించగా జరిగిన పొరపాటును నిర్వాహకులు గుర్తించారు. పొరబాటుగా టైప్ చేయడంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. తర్వాత మేనేజర్ వచ్చి జరిగింది తెలుసుకొని మిగితా డబ్బును ఆయన ఖాతాకు బదిలీ చేశారు. మొత్తానికి మత్తుకోసం బీరుతాగేందుకు వెళ్లిన పీటర్‌కు బిల్లు చూసి ఒక్క క్షణంలో తాగింది దిగి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు నిర్వాహకుల తీరును తప్పుబడుతున్నారు.

Updated : 7 Sep 2019 12:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top