భార్య వద్దని వారిస్తున్నా వదలని భర్త.. క్షణాల్లో మారిపోయిన జీవితం - MicTv.in - Telugu News
mictv telugu

భార్య వద్దని వారిస్తున్నా వదలని భర్త.. క్షణాల్లో మారిపోయిన జీవితం

May 4, 2022

కొన్ని క్షణాల్లో కొందరి జీవితం ఎలా మారిపోతోందో చెప్పడానికి ఈ ఆస్ట్రేలియా దంపతులు చక్కటి ఉదాహరణగా నిలుస్తారు. విషయమేంటంటే.. ఆస్ట్రేలియాకు చెందిన భార్యాభర్తల్లో భార్యకు ప్రతీవారం లాటరీ కొనడం అలవాటు. ఎప్పటినుంచో లాటరీ కొంటున్నా.. ఎప్పుడూ తగిలేది కాదు. ఈ సారి టీవీల్లో లాటరీ విజేతలను ప్రకటిస్తుండగా, భార్య ఈ సారి కూడా తగల్లేదని నిరాశతో టిక్కెట్టును చెత్తబుట్టలో పారేయబోయింది. పక్కనే ఉన్న భర్త ఏదీ ఒకసారి చూద్దామంటూ టిక్కెట్ అడిగితే వారించి మళ్లీ పారేయబోతే భర్త అడ్డుకొని టిక్కెట్ తీసుకున్నాడు. టీవీలో వచ్చే నెంబరును సరిగ్గా చూసి తమ టిక్కెటు నంబరు చూడగా, వారి వద్ద ఉన్న టిక్కెట్టుకే లాటరీ తగిలిందని తెలియడంతో దంపతులిద్దరూ ఎగిరి గంతేశారు. లక్ష డాలర్లు గెలుచుకున్నారు. ఇది మన కరెన్సీలో రూ. 70 లక్షలకు సమానం. ఈ డబ్బుతో కారు కొనుక్కొని, మిగతా డబ్బును తమ పిల్లలకు ఇస్తామని వారు చెబుతున్నారు.