గాల్లోనే ఢీ కొట్టుకున్న రెండు విమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

గాల్లోనే ఢీ కొట్టుకున్న రెండు విమానాలు

February 20, 2020

Australia Horrific Planes Crash

ఆకాశంలో రెండు తేలికపాటి విమానాలు ఢీ కొట్టుకొని పిట్టల్లా కింద పడిపోయాయి. ఆస్ట్రేలియాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ అందులో ఉన్నవారంతా మరణించారు. భూమికి 4 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.   

విక్టోరియాలోని మంగలూరు ఎయిర్‌పోర్టుకు సమీపంలో రెండు శిక్షణా విమానాలు గాల్లోకి ఎగిరాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పైలెట్లకు విమానాలను గుర్తించే వీలు లేకపోయింది. దీంతో రెండు ఒకటినొకటి ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కో విమానంలో ఇద్దరేసి చొప్పున ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ నలుగురు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు విమానాలు ఒకేసారి ఎందుకు అక్కడ ఉన్నాయనే కోణంలో విచారణ చేపట్టారు. కాగా గడిచిన దశాబ్ధ కాలంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు.