అహ్మాదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ముందు భారీ లక్ష్యమే ఉంది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 36 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌటై నిర్దేశించిన 480 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి మనోళ్లు చెలరేగి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. క్రీజులో ఉన్న రోహిత్ శర్మ 17, శుభ్మన్ గిల్ 18 పరుగులు చేశారు. అంతకు ముందు రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసిస్ ఆటగాళ్లు తబడకుండా ఆడారు.
ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు చేశారు. గురువారం నాటి 255/4 స్కోరుతో రెండో రోజు రంగంలోకి ఆసీస్ ఆటగాళ్లు తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్ పడేసరికి 208 పరుగులు జత చేశారు. ఉస్మాన్ ఖవాజా అక్షర్ పటేల్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి టెస్టును డ్రా చేసుకున్నా సిరీస్ వశమవుతుంది.