ఇల్లు నిర్మాణంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన శైలిలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు. ఖరీదైన ఆర్కిటెక్ట్ తో డిజైన్ గీయించుకుంటారు. కానీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఇల్లు నిర్మించాడు.
సర్రిహిల్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో వంట గదిలో గోడలు లేకుండా గాజు గ్లాస్‌తో బాత్‌రూమ్‌ను నిర్మించాడు. వంటగదిని బాత్‌రూమ్‌ను కేవలం గాజు గ్లాస్ మాత్రమే వేరుచేస్తుంది. ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ ‘మాడ్రన్ కిచెన్’గా రూపొందించిన ఈ ఫ్లాట్‌ను ప్రస్తుతం అద్దెకు పెట్టారు. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చితే వారానికి దాదాపు రూ.18 వేల చెల్లించి అద్దెకు ఉండొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనికి ‘టాయిలెట్ ఇన్ ది కిచెన్ లే అవుట్’ అని నామకరణం చేశారు. ఈ డిజైన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. బాత్రూం మనుషుల ప్రైవసీకి సంబంధించిన విషయం.. అలాంటిది కిచెన్ లో ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. అయితే నెటిజన్ల విమర్శలను ఈ ఇంటి యజమాని కొట్టి పడేస్తున్నారు. ఈ ఇల్లుపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు.
Sydney real-estate is a literal toilet in your literal kitchen going for $380 a week in Surry Hills. pic.twitter.com/xDTvxwA9JE
— Joan Westenberg (@Joanwestenberg) May 4, 2020