శార్దూల్ సూపర్ పంజా.. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

శార్దూల్ సూపర్ పంజా.. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు 

January 7, 2020

hbn yhn

మన పేసర్ శార్దూల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో బాగా చేతివాటం ప్రదర్శించాడు. కేవలం 5 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి టీంను హుషారెత్తించాడు. శార్దూల్‌కు తోడు సైనీ, బుమ్రా, కుల్దీప్ కూడా చెలరేగిపోవడంతో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే నమోదు చేసింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తమ బౌలింగ్‌తో భారీ స్కోరు చేయనివ్వకుండా వారిని నిలువరించారు. సైనీ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసి లంక పతనంలో పాలుపంచుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ విసిరిన 19వ ఓవర్ హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు తన ఖాతాలో వికెట్ లేకుండా ఉన్నా.. ఆ ఓవర్ పూర్తయ్యేసరికి మూడు వికెట్లును సాధించాడు. కాగా, లంక ఇన్నింగ్స్‌లో 34 పరుగులతో కుశాల్ పెరీరా టాప్ స్కోర్ నమోదు చేశాడు.