కరోనా ఎఫెక్ట్.. నిరుద్యోగ భృతి రెట్టింపు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్.. నిరుద్యోగ భృతి రెట్టింపు

March 23, 2020

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడటంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులపై ప్రభావం ఎక్కువగానే ఉంది. దీని నుంచి బయటపడేందుకు తాత్కాలిక చర్యలను ప్రారంభిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిరుద్యోగ భృతిని రెట్టింపు చేసింది. ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. 

పెన్షన్లు, నిరుద్యోగ భృతి కోసం ఏకంగా ప్రభుత్వ ఖజానా నుంచి  రూ.2.9 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. 10 లక్షల మంది యువకులు తీసుకుంటున్న నిరుద్యోగ భృతి 566 డాలర్లకు అదనంగా 550 డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. వీటితో పాటు పింఛన్ దారులకు కూడా చేయూతనిస్తామని పేర్కొన్నారు. నెలనెలా సుమారు రూ.32 వేలు అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండేందుకు వాటికి చేయూతనిస్తామని ప్రకటించారు. చిన్న చిన్న పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలకు రాయితీలు ఇస్తామన్నారు. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమం కోసం  నిధులు కేటాయించడం తొలిసారిగా పలువురు అభిప్రాయ పడుతున్నారు. వైరస్ వల్ల ఆర్ధికంగా నష్టపోయినవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.