ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ విమానం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ విమానం

July 11, 2019

ఐఐసీ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇంతలో ఓ విమానం స్టేడియం మీదుగా చక్కర్లు కొట్టి కలకలం రేపింది. ‘ప్రపంచం మొత్తం బెలూచిస్థాన్ విషయంలో స్పందించాలి’ అనే బ్యానర్‌తో విమానం స్టేడియం మీదుగా వెళ్లింది. దీంతో ఇరు దేశాలకు చెందిన అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఐఐసీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీ జరుగుతుండగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి. 

ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. మ్యాచ్ జరుగుతున్న ప్రదేశంలో రాజకీయ అంశాలకు ఆస్కారంలేదని పేర్కొంది. ప్రేక్షకుల, క్రీడాకారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం పరిసర ప్రాంతాలని నో ఫ్లైజోన్‌గా ప్రకటించింది. లీడ్స్ వేదికగా ఇండియా, శ్రీలంక జట్లు ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.