Australia won by 4 run vs afg
mictv telugu

ఆసీస్ సెమీస్‌కా ? ఇంటికా ?

November 4, 2022

టీ‌20 ప్రపంచ కప్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తన సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మెరుగైన రన్‌రేట్‌‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నామమాత్రపు ఆటతో నెగ్గింది. ఆఫ్గానిస్థాన్‌పై అతికష్టంతో నెగ్గి సెమీస్ అవకాశాలను ఇంకాస్త దెబ్బతీసుకుంది. ఇప్పుడు ఆసీస్ సెమీస్ కు చేరాలంటే ఉన్నఏకైక మార్గం శ్రీలంక చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడమే. ఇక శ్రీలంకపై ఇంగ్లాడ్ గెలిస్తే మాత్రమే నెట్ రన్‌రేట్ ఆధారంగా ఆసీస్ ఇంటి ముఖం పట్టాల్సిందే. ఇంగ్లాడ్ నెట్ రేట్ కంటే ఆసీస్ రన్‌రేట్ తక్కువ ఉండడంతో ఆతిథ్య జట్టుకు అవకాశం దక్కకుండా పోతుంది.

నెట్ రన్ రేట్ పెంచుకునేందుకు భారీ తేడాతో నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ కేవలం 4 పరుగులతో తేడాతో విజయం సాధించింది.చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 23 బంతుల్లో 48 పరుగులు చేసి ఆసీస్‌ను ఓడించినంత పనిచేసాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్(54) అర్థసెంచరీతో చెలరేగగా..మిచెల్ మార్ష్ 45, వార్నర్ 25, స్టోయినిస్ 25 పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లు ఎన్.హుల్.హక్ మూడు వికెట్లు తీయగా, ఫరూఖి రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్భాజ్ 17 బంతుల్లో 30 పరుగులు, నయీబ్ 23 బంతుల్లో 39 పరుగులు, జర్డాన్ 26 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్, జంపా రెండేసి వికెట్లు తీసారు.