4 కోసం12 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

4 కోసం12 కోట్లు 

August 31, 2017

కొందర్కి ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి మామూలుగా ఉండదు. కొత్త  సిమ్ తీసుకున్నా ఫ్యాన్సీ నంబర్, కొత్త  కారో, బైకో తీసుకున్నా  ఫ్యాన్సీ నంబర్ కోసం ఎగబడుతుంటారు. శారాణ కూరకు బారాణా మసాలా అన్నట్టు  దాని కోసం వేలు, లక్షలు కూడా ఖర్చుపెట్టడానికి వెనుకాడరు. కనీ ఆస్ట్రేలియాల ఓ శ్రీమంతుడు.. 4 అనే నంబర్ ప్లేట్ కోసం ఏకంగా 2.45 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 12 కోట్ల 80 లక్షల రూపాలు వెట్టి తీస్కున్నడట.అంతేకాదు ఆస్ట్రేలియాలో నంబర్ పేట్ల కోసం ఇప్పటివరకు వేసిన వేలంలో ఎక్వ రేటుకు పోయింది గుడ గిదేనట. సూస్తుంటే గ శ్రీమంతునికి గ 4 నంబర్ అంటే ఏదో సెంటిమెంట్ ఉన్నట్టున్నది. అందుకే కోట్లు గుమ్మరిచ్చి దక్కిచ్చుకున్నడు. కనీ ఆయ్న వాడే కారుగుడ గన్ని కోట్లు ఉంటదో ఉండదో మరి. అయినా ఏ నంబరైతే ఏముంది కదా, ట్రాఫిక్ రూల్స్ పాటించపోతే అరే ఫ్యాన్సీ నంబరని  ఇడ్శిపెడ్తరా. లేకపోతే కట్టే చలానాలల్ల డిస్కౌంట్ ఇస్తరా!  పరపతి సూపిచ్చుకోనికి  తప్పితే.. ఫ్యాన్సీ నంబర్లతోని దమ్మిడి పాయిదా ఉండది అనేది వాస్తవం.