మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ కు తెలుగోడి షాక్..! - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ కు తెలుగోడి షాక్..!

June 22, 2017

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ అదరగొట్టాడు. ఇండోనేసియా ఓపెన్‌లో నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌కి షాకిచ్చిన శ్రీకాంత్‌ మరోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోటీల్లో శ్రీకాంత్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ సన్‌వాన్‌ హో(దక్షిణకొరియా)ని మట్టికరిపించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా ప్రిక్వార్టర్స్‌లో జరిగిన కిదాంబి శ్రీకాంత్‌.. నెంబర్‌ వన్‌ క్రీడాకారుడు సన్‌వాన్‌ హోపై 15-21, 21-13, 21-13తో గెలిచాడు.తొలి సెట్‌ను చేజార్చుకున్న శ్రీకాంత్‌ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని రెండు వరుస సెట్లలో పైచేయి సాధించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు.