ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ తలకు గాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ తలకు గాయం

August 18, 2019

steve smith.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సీరిస్ లో మంచి ఫార్మ్ లో ఉన్న స్మిత్ గాయపడ్డాడు. రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ వేసిన బంతి ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌ స్మిత్ తగలడంతో స్మిత్‌కు బలమైన గాయమైంది. 

వెంటనే అక్కడున్న డాక్టర్లు అతడికి చికిత్సను అందించారు. ఇక ఆసీస్ డాక్టర్ల సూచన మేరకు స్మిత్ రిటైర్డ్ హార్డ్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్మిత్ 80 పరుగులు సాధించాడు. సిడిల్ ఔట్ అయిన తరువాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ మరో 12 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో యాషెస్‌లో వరుసగా ఏడుసార్లు అర్థ సెంచరీలు సాధించిన ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.