వాటర్‌ బాయ్‌గా మారిన ఆస్ట్రేలియా ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

వాటర్‌ బాయ్‌గా మారిన ఆస్ట్రేలియా ప్రధాని

October 25, 2019

క్రికెట్ ఆటను మనదేశంలో ఎంతలా అభిమానిస్తారో మనందరికీ తెలిసిందే. అలాంటిది క్రికెట్ జాతీయ క్రీడగా ఉన్న ఆస్ట్రేలియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ దేశ ప్రధాని కూడా గొప్ప క్రికెట్ అభిమానని తెలియడానికి ఇటీవల జరిగిన ఓ సంఘటనే చక్కటి ఉదాహరణ. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిస స్టేడియంలో క్రికెట్ ఆడుతోన్న ఆటగాళ్ల కోసం స్వయంగా డ్రింక్స్‌ తీసుకవచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా వేదికగా శ్రీలంక, ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో క్రికెట్‌కు వీరాభిమాని అయిన స్కాట్ మోరిసన్ తమ ఆటగాళ్ల కోసం డ్రింక్స్‌ కంటైనర్‌ మోసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. దేశ ప్రధాని రిజర్వ్‌ ప్లేయర్‌లాగా మారారడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ గ్రౌండ్‌ నుంచి వెళ్లిపోయారు. క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని స్కాట్‌ మోరిస ఈ రకంగా చాటుకున్నారు.