ఓ గెట్ టుగెదర్ మీటింగ్‌కి అటెండ్ అయిన పేరెంట్స్.. తమ వెంట వచ్చిన పిల్లలంతా ఒకేలా ఉండడం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. మొత్తం 60 మంది చిన్నారులు ఒకే రకంగా ఉండడంతో ఎవరి పొరపాటో తెలియక అయోమయానికి గురయ్యారు. ఆస్ట్రేలియాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇండిపెండెంట్ మీడియా ఓ కథనాన్ని రాసింది.
ఎల్జీబీటీ వర్గానికి(స్వలింగ సంపర్కానికి) చెందిన పేరెంట్స్ అందరూ ఓ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అక్కడకు పిల్లలతో పేరెంట్స్ వచ్చారు. అక్కడకు వచ్చిన పిల్లల్లో అందరూ దాదాపు సేమ్‌గా కనిపించారు. పిల్లలు ఒకేలాగ ఉండడం గమనించి పేరెంట్స్ షాకయ్యారు. దీంట్లో ఏదో తేడా ఉందని గమనించి ఆ కోణంలో ఆరా తీశారు. ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని ఐవీఎఫ్ క్లినిక్‌లను సంప్రదించారు. ఆస్పత్రికి చేరుకొని అసలు ఇదెలా సాధ్యమైందని ఆరా తీయగా… ఆస్పత్రి వర్గాలు పిల్లల వివరాలను సేకరించాక, అసలు నిజం తాపీగా చెప్పేశారు. వీరందరికీ ఒక్కడే తండ్రి అని ఓ షాకింగ్ నిజాన్ని ఆ పేరెంట్స్ ముందు బయటపెట్టారు.
అన్ని సెంటర్లలో వీర్య కణాలు డోనేట్ చేసిన వ్యక్తి ఒక్కడే అని తెలిసింది. నాలుగు పేర్లతో సదరు వ్యక్తి తన వీర్య కణాలను దానం చేసినట్లు గుర్తించారు. స్పెర్మ్ డోనార్ సెంటర్లు అన్నీ అతని వద్ద నుంచి వీర్య కణాల్ని సేకరించినట్లు భావిస్తున్నారు. ఫెర్టిలిటీ ఫస్ట్ క్లినిక్ డాక్టర్ అన్నే క్లార్క్ ఈ ఘటనపై ఓ ప్రకటన చేశారు. తమ క్లినిక్‌కు ఆ వ్యక్తి ఒకసారి వచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ అనధికార పద్ధతుల్లో ఆ వ్యక్తి తన స్పెర్మ్‌ను డొనేట్ చేసినట్లు ఆమె చెప్పారు.
గత కొన్నేళ్లుగా స్పెర్మ్ దానం చేసే ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. వేరేవారి స్పెర్మ్‌తో పిల్లలను కనడం సాధారణ విషయంగా మారిపోయింది. కానీ ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం స్పెర్మ్ డోనేషన్ నేరం. గిఫ్ట్‌లు తీసుకుని వీర్య కణాల ఇవ్వడం కూడా నిషేధం. అక్రమ పద్ధతిలో వీర్య కణాలను డోనేట్ చేయడం వల్ల అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.