Australian Teacher Turns ‘Monster’ Drawings by Students into Cute Toys
mictv telugu

పిల్లలు గీసిన చిత్రాలు.. టాయ్స్ రూపంలో!

December 31, 2022

ఆస్ట్రేలియన్ టీచర్.. తమ విద్యార్థులు వేసిన రాక్షస డ్రాయింగ్ ల ఆధారంగా స్టప్డ్ బొమ్మలను తయారుచేస్తుంది. పిల్లలకు మరింత దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్న ఆ టీచర్ ని అందరూ ఇప్పుడు పొగిడేస్తున్నారు.పిల్లలు చాలా సృజనాత్మకంగా ఉంటారు. వారి ఆలోచనలకు పదును పెట్టి డ్రాయింగ్స్ వేస్తుంటారు. అయితే కొందరు వేసే డ్రాయింగ్స్ సూపర్ గా కుదురుతాయి. మరికొందరు వేసే డ్రాయింగ్స్ ని చూస్తే రాక్షస బొమ్మలు గుర్తుకొస్తుంటాయి. కానీ వారిని కూడా ఎంకరేజ్ చేయడానికి మెల్ బోర్న్ కి చెందిన ఒక టీచర్ స్టఫ్డ్ బొమ్మలను చేసి ఇస్తున్నది. ఆమె చేసి ఈ పనిని ఒక తండ్రి ట్విట్టర్ ద్వారా పంచుకోవడంతో ఆమె గురించి ఈ ప్రపంచానికి తెలిసింది.

రీడ్ పార్కర్.. ఆస్కార్ తండ్రి. తన పిల్లలు ఉపాధ్యాయురాలు చేసిన అసలు డ్రాయింగ్ తో పాటు, స్టఫ్డ్ బొమ్మలను పంచుకున్నాడు. ఆయన ‘నా పిల్లల టీచర్ వారి డ్రాయింగ్ ల ఆధారంగా ఆమె తరగతికి బొమ్మలు తయారు చేశారు. ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనం ఇవ్వండి’ అంటూ రాసుకొచ్చారు. తన కొడుకు గీసిన బొమ్మ థెరిజినోసారస్ అని అతను చెబితే అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తన కొడుకు బొమ్మలే కాకుండా ఇతరుల బొమ్మలు కూడా పంచుకున్నడు. ఆమె కోవిడ్ సమయంలో చుట్టుపక్కల వారిని, చిన్న పిల్లలను వాళ్ల ఇళ్ల వద్ద దింపడం చేసింది.
పార్కర్.. ఆ ఉపాధ్యాయురాలి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అందుకే గో ఫండ్ మీ అనే నిధుల సమీకరణను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే పిల్లల కోసం చేసే ఆ బొమ్మలు తన స్వంత ఖర్చుతో తయారు చేస్తుంది. ఆ స్టఫ్ కోసం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ నిధులు ఆమెకు ఇస్తే పిల్లలకు మరిన్ని బొమ్మలు చేసి ఇస్తుంది. దీంతో పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని అంటున్నాడు పార్కర్. కొంతమంది స్పందించి విరాళాలు ఇచ్చినట్లుగా కూడా పేర్కొన్నాడు. అయితే ఇంత కథలో ఆ టీచర్ పేరు తెలుపలేదు పార్కర్.