దయలేని దొంగలు.. బుద్ధిమాంద్యం బాలిక కుక్క చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

దయలేని దొంగలు.. బుద్ధిమాంద్యం బాలిక కుక్క చోరీ

December 8, 2019

dog stolen.

దొంగలకు ఏమాత్రం విచక్షణ లేకుండా పోతోంది. కాస్త విలువైంది కనిపిస్తే చాలు లేపేస్తున్నారు. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్ల  తనకు ఆసరాగా ఉంచుకున్న ఓ కుక్కను కూడా లేపేశారు. బ్రిటన్‌లోని లీసెస్టర్ షైర్‌లో గతవారం జరిగిందీ చోరి. 

పీట్లింగ్ పార్వా ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఆటిజంతో బాధపడుతోంది. ఆమెకు తోడుగా ఉంటుందని తల్లిదండ్రులు ఓ కుక్కను ఏర్పాటు చేశారు. బాలికకు అది చిన్నచిన్న సాయం చేసేది. డాల్మేషియన్ జాతికి చెందిన ఈ మూగజీవిపై దొంగల కన్ను పడింది. డిసెంబర్ 1 నుంచి అది కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. చోరీకి ముందు తమ ఇంటి వద్ద ఒక డ్రోన్ తిరిగిందని, దొంగలే కుక్కను నొక్కడానికి రెక్కీ చేసి ఉంటారని బాలిక తల్లి ఆరోపిస్తోంది. కుక్క లేకపోవడంతో బాలిక నిద్రాహారాలు మానేసింది. దయచేసి దొంగలు తిరిగి కుక్కను ఇచ్చేయాలని తల్లి కోరుతోంది.