దేవుడు ఆటో డ్రైవర్ రూపంలో..పెళ్లికి దాచుకున్న డబ్బులతో పేదలకు.. - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడు ఆటో డ్రైవర్ రూపంలో..పెళ్లికి దాచుకున్న డబ్బులతో పేదలకు..

May 18, 2020

Auto driver akshay spending his savings for migrate labour

లాక్ డౌన్ కారణంగా ఎందరో వలసకూలీలు ఉపాధి కోల్పోయారు. సరైన రవాణా సౌకర్యాలు లేనప్పటికీ కాలినడకన ఇళ్లకు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వాళ్ళ బాధలు చూడలేక ఎందరో దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను వలస కూలీల కోసం ఖర్చు చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పూణేలోని టింబర్ మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ల ఆటో డ్రైవర్ అక్షయ్ తన పెళ్లి కోసం రెండు లక్షల రూపాయ‌లు దాచుకున్నాడు. కాగా, లాక్ డౌన్ కారణంగా అత‌ని పెళ్లి వాయిదా పడింది. దీంతో ఈ మొత్తాన్ని వలస కూలీలు, నిస్సహాయుల‌కు ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తున్నారు. త‌న స్నేహితుల సహాయంతో ప్రతిరోజూ 400 మందికి అక్షయ్ ఆహారాన్ని అందిస్తున్నాడు. ‘నేను ఆటో నడుపుతున్నప్పుడు రూ .2 లక్షలు జ‌మ చేశాను. నాకు మే 25న వివాహం జరగాల్సి ఉన్న‌ప్ప‌టికీ, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసుకున్నాను. లాక్ డౌన్ లో వలసకూలీల అవ‌స్థ‌లు చూసి, వారికి సాయం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నాను.’ అని అక్షయ్ తెలిపాడు.