Auto driver floated in chitravati river flood
mictv telugu

వినకుండా వెళ్లి.. శవమై తేలిన ఆటోడ్రైవర్

August 1, 2022

‘వరదలో వెళ్లొద్దప్పా..’ అని అందరూ నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా వినకుండా ఆటోను కాజ్వే పై నుంచి నడిపిస్తూ కొట్టుకుపోయాడు ఓ ఆటో డ్రైవర్. తర్వాత ఆ నది నీటిలోనే శవమై కనిపించాడు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కోడూరు నుంచి స్వగ్రామం చాగలేరు పంచాయతీలోని శాన్‌గాన్‌పల్లికి వస్తున్న ఆటో డ్రైవర్‌ శంకరప్ప చిత్రావతి నదిని వరదలో దాటేయడానికి దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని, వెళ్లడం మంచిది కాదని స్థానికులు వారించినా వినలేదు. మధ్యలో నీటి ధాటికి ఆటోను నడపలేక ఆటోతోసహా కొట్టుకుపోయాడు. అతని మృతదేహాన్ని సోమవారం సుబ్బారావు పేట సమీపంలో నది ఒడ్డున కనుగొన్నారు. దివ్యాంగుగైన శంకరప్ప ఆటో నడిపి జీవనం కొనసాగిస్తున్నారు.