అనంతపురంలో ఘాతుకం.. బాలిక ఇంటికెళ్లి ఇలా... - MicTv.in - Telugu News
mictv telugu

అనంతపురంలో ఘాతుకం.. బాలిక ఇంటికెళ్లి ఇలా…

May 8, 2020

Auto Driver Force Love In Anantapur .jp

ఏపీలో మహిళలపై దాడులు జరగకుండా దిశ చట్టం తీసుకువచ్చినప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏ మాత్రం భయం లేకుండా మహిళలపై దాడుకు తెగబడుతున్నారు. అనంతపురం జిల్లాలో శుక్రవారం ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో బాలికపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. గుత్తి అనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

ఆటో డ్రైవర్‌‌గా పని చేస్తున్న రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన 10 తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. చాలా కాలంగా వెంటపడిన అతడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లడం చూసిన రామాంజనేయులు ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు కూడా ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ గొడవకు దిగాడు. బాలిక ప్రతిఘటించడంతో ముందుగానే వెంట తెచ్చుకున్న బ్లేడుతో బాలిక గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను గుర్తించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.