18 కి.మీ. దూరానికి రూ.4,300.. అటో డ్రైవర్ దందా  - MicTv.in - Telugu News
mictv telugu

 18 కి.మీ. దూరానికి రూ.4,300.. అటో డ్రైవర్ దందా 

September 19, 2019

Auto driver forcefully collected four thousand from software employee in pune

ఏదైనా నగరానికి కొత్తగా వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే సంఘటన ఇది. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి పని నిమిత్తం మొదటిసారి పూణే వెళ్ళాడు. అక్కడ ఎరవాడ అనే ప్రాంతానికి వెళ్ళడానికి ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కే ముందు చార్జి ఎంత అని డ్రైవర్‌ను అడిగాడు. అందుకు ఆ డ్రైవర్.. మీకు తోచినంత ఇవ్వమని అన్నాడు.

ఆటో డ్రైవర్ మంచితనానికి ఫిదా అయిన ఆ యువకుడు ఆటోలో ఎక్కి కూర్చున్నాడు. యువకుడు నగరానికి కొత్త అని గ్రహించిన ఆటో డ్రైవర్ ఆ యువకున్ని 18 కిమీ తీసుకొని వెళ్లి ఓ నిర్మాణుష్యప్రాంతంలో ఆపి ఆటో చార్జి 4 వేలు ఇవ్వాలని బెదిరించారు. కానీ. ఆటో మీటర్ తక్కువ చూపిస్తుండడంతో ఆ యువకుడు వాదించాడు. దీంతో కోపాద్రిక్తుడైన ఆటో డ్రైవర్ అప్పటికే ఆటోలో ఉన్న మరో వ్యక్తితో కలిసి యువకున్ని బెదించాడు. ఆటో చార్జ్ 4వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొని వచ్చాడు. ఆటోలో ఉన్న మరో వ్యక్తితో కలిసి యువకున్ని కొట్టి తన పర్స్‌లో ఉన్న 4వేల 300 రూపాయలు లాక్కున్నారు. వెంటనే ఆ యువకుడు ఎరవాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. అదృష్టవశాత్తు ఆటో నెంబర్ బాధిత యువకుడు నోట్ చేసుకొని పోలీసులకు చెప్పడంతో వారు ఆటో కోసం వెతకడం మొదలు పెట్టారు.