నిజాయతీ బతికే ఉంది.. లక్షన్నర సొమ్మును మట్టుకోని ఆటోవాలా - MicTv.in - Telugu News
mictv telugu

నిజాయతీ బతికే ఉంది.. లక్షన్నర సొమ్మును మట్టుకోని ఆటోవాలా

August 12, 2020

Auto driver honesty incident.

ఆటో డ్రైవర్ల నిజాయితీకి అద్దం పట్టే సంఘటన ఒకటి తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగింది. నగరానికి చెందిన మహ్మద్‌ హబీబ్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటలకు మహ్మద్‌ హబీబ్‌ ఆటోలో ఇద్దరు మహిళలు ఎక్కారు. సిద్దంబర్‌ బజారు ప్రాంతంలో వాళ్ళను దింపిన తరువాత మధ్యాహ్నం 2.30గంటలకు తాడబన్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. నీళ్లు తాగటానికి వాటర్‌ బాటిల్‌ కోసం ప్యాసింజర్‌ సీటులో వెతికాడు. అతడికి ఓ బ్యాగ్‌ కనిపించింది. దీంతో ఆ బ్యాగ్ సిద్దంబర్‌ బజార్‌ ప్రాంతంలో దిగిన మహిళది అనుకున్నాడు. దానిని ఆమెకు ఇవ్వడానికి తిరిగి సిద్దంబర్‌ బజార్‌ కి వెళ్లి వాళ్ళ కోసం వెతికాడు. 

కానీ, వాళ్ళు అక్కడ కనిపించలేదు. దీంతో ఆ బ్యాగ్ లో ఏమైనా వివరాలు ఉంటాయి అనుకుని ఓపెన్ చేసి చూసాడు. అందులో ఎలాంటి వివరాలు లేవు. కానీ, 1.40 లక్షల రూపాయల నగదు ఉంది. దీంతో ఆ బ్యాగ్ ను పోలీస్‌ స్టేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు. అదే సమయంలో బ్యాగ్‌ మర్చిపోయిన మహిళ కూడా బ్యాగ్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. మహ్మద్‌ ఆమెను గుర్తు పట్టి పోలీసుల సమక్షంలో బ్యాగ్‌ ఆమెకు అందించాడు. పోయింది అనుకున్న బ్యాగ్ దొఅరకడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవ్. మహ్మద్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక అతడికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చింది. పోలీసులు కూడా మహ్మద్‌ నిజాయతీని ప్రశంసించి అతడికి అతడికి సన్మానం చేశారు.