పోలీసులపై కోపంతో  ఆటోకు నిప్పు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులపై కోపంతో  ఆటోకు నిప్పు

September 30, 2019

Auto Driver Protest In Puttaparthi

అనంతపురం జిల్లా పుట్టపర్తి పోలీసులు తీసుకువచ్చిన కొత్త నిబంధన ఆటో డ్రైవర్లను ఆగ్రహానికి గురి చేసింది. ఆటోకు నంబర్ కేటాయించలేదని ఓ ఆటోడ్రైవర్ తన వాహనానికి నిప్పుపెట్టాడు. ఆటోల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. దీని కోసం కొన్ని రోజులుగా పోలీసులు పుట్టపర్తిలో వాహనాలకు ప్రత్యేకంగా నెంబర్లు కేటాయిస్తున్నారు. కానీ 150 ఆటోలకు మాత్రం వివిధ కారణాలతో నంబర్లు ఇవ్వలేదు.  దీనిపై ఆగ్రహంతో నాగేంద్ర అనే వ్యక్తి తన ఆటోకు నిప్పుపెట్టి కాల్చేశాడు. 

పోలీసులు నెంబర్ వేయని ఆటోలు రోడ్డుపైకి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తనకు నంబర్ కేటాయించాలంటూ ఎన్నోసార్లు పోలీసు ఉన్నతాధికారులను నాగేంద్ర కోరారు. అయినా వారెవరూ స్పందించలేదు. పోలీసుల తీరుతో విసిగిపోయిన ఆటో డ్రైవర్ పుట్టపర్తి ఎమ్మెల్యే  ఇంటివద్ద ఆటోను నిప్పుపెట్టి కాల్చేశాడు. ఈ విషం తెలిసిన పోలీసులు అక్కడికి వచ్చే లోపే ఆటో పూర్తిగా కాలిపోయింది. నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.