ఆటో ఎక్స్పో నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు సంవత్సరాల విరామం తర్వాత ఆటో ఎక్స్పో తిరిగి ప్రారంభం అవుతోంది. ఈ ఆటో ఎక్స్పో రెండు వేర్వేరు వేదికలలో జరుగుతుంది. ఒకటి న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్పో కాంపోనెంట్ షో, రెండవది గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో మోటార్ షో జరగనుంది.
ఆటో ఎక్స్పో తేదీ, సమయం
జనవరి 11 నుంచి జనవరి 18 వరకు ఆటో ఎక్స్పో ఈవెంట్ జరగనుంది. జనవరి 11, జనవరి 12 మొదటి రెండు రోజులు మీడియా కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇది జనవరి 13న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారవేత్తలకు ఒపెన్ చేస్తారు. ఈ ఈవెంట్ జనవరి 14 నుండి 18 వరకు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ ఈవెంట్ ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 14-15న సాయంత్రం 8గంటలకు, జనవరి 16-17న సాయంత్రం 7గంటలకు, జనవరి 18న సాయంత్రం 6గంటలకు ముగుస్తుంది.
ఆటో ఎక్స్పో టిక్కెట్ ధర
జనవరి 13న జరిగే ఆటో ఎక్స్పో 2023 ధర రూ.750గా నిర్ణయించారు. జనవరి 14, 15 తేదీల్లో టిక్కెట్ ధర రూ. 475 కాగా, ఈవెంట్ చివరి మూడు రోజుల ఖర్చు రూ. 350గా ఉంటుంది. మీరు ఈ ఈవెంట్ కు వెళ్లాలనుకుంటే BookMyShow వెబ్సైట్లో దీని టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేకత ఏంటంటే
మారుతీ సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా, రెనాల్ట్ ఇండియా వంటి తయారీదారుల నుండి అనేక కార్లు ఆటో ఎక్స్పో 2023లో ఆవిష్కరించబడతాయి. ఇవే కాకుండా, అనేక ఎలక్ట్రిక్ కార్లను కూడా ఈ ఈవేంట్ ద్వారా పరిచయం చేయనున్నారు. ఇందులో ఎక్స్‌పోజిషన్స్ లాబీ, అడ్వెంచర్ జోన్, టెక్నాలజీ జోన్, స్టూడియో జోన్, లాంచ్ జోన్, ఎంటర్టైన్మెంట్ జోన్, సస్టైనబిలిటీ జోన్ ఉంటాయి.