ఏపీ వెళ్లవారికి గుడ్‌న్యూస్.. ఆటోమేటిగ్గా ఈపాస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ వెళ్లవారికి గుడ్‌న్యూస్.. ఆటోమేటిగ్గా ఈపాస్

August 1, 2020

Automatic e-pass system in andhra pradesh

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ  రావడానికి పాస్ తీసుకోవాలంటే కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేది. తాజాగా అన్‌లాక్‌ 3.0 లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. 

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణీకుల కోసం ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే.. ఈ పాస్ జారీ చేయనున్నారు. సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్‌కు పాస్ వివరాలు పంపనున్నారు. బోర్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద ఈ-పాస్‌తో పాటు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇవి రెండూ ఉంటేనే పోలీసులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.