హైదరాబాద్‌లో ఆటోమొబైల్, ఏసీ/కూలర్ దుకాణాలు ఓపెన్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఆటోమొబైల్, ఏసీ/కూలర్ దుకాణాలు ఓపెన్

May 18, 2020

hyderabad

నాలుగవ దశ లాక్ డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా మరికొన్ని దుకాణాలు తెరచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆటోమొబైల్స్‌, ఏసీ దుకాణాలు సోమవారం తెరచుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22వ తేదీన మూతపడిన దుకాణాలు… ప్రభుత్వ మినహాయింపులతో ఇప్పుడు మళ్ళీ తెరచుకున్నాయి. 

దీంతో దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ పెరిగింది. బేగం బజార్‌, రామ్ కోఠి, ట్రూప్‌ బజార్‌లోని ఆటోమొబైల్, ఏసీ, ఎయిర్ కూలర్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుండా బల్దియా అధికారులు శానిటైజేషన్‌ చేస్తున్నారు. దుకాణదారులు కూడా తమ దుకాణాల వద్ద కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధంగా దుకాణాల ముందు గుండాలు గీస్తున్నారు. మాస్కు ధరించకుండా వచ్చే వారిని దుకాణాల్లోకి అనుమతించకూడదని దుకాణాల యజమానులు నిర్ణయించారు.