కృష్ణా జిల్లా అవనిగడ్డ భారీ పేలుడు! - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణా జిల్లా అవనిగడ్డ భారీ పేలుడు!

August 1, 2020

Avanigadda blast incident

ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ జిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా గ్రామంలోని కొన్ని ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. 

పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ పేలుడు గ్రామంలోని తుంగల దిలీప్ అనే రైతు పశువుల పాకలో జరిగినట్టు పోలీసులు గుర్తించారు. పశువుల పాకలో నిల్వ ఉంచిన యూరియా బస్తాల వద్ద పేలుడు జరిగిందని, సోడియం నైట్రేట్, అమోనియంలు దగ్గరగా ఉండడంతో ఒత్తిడికి గురై పేలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దిలీప్ ను ప్రశ్నించగా.. పొలం నాట్ల కోసం ఈ ఎరువులను తెచ్చుకున్నట్టు తెలిపారు.