Avatar 2 movie ticket rates higher in major cities
mictv telugu

భయపెడుతున్న అవతార్ 2 సినిమా టిక్కెట్ల ధరలు

November 22, 2022

Avatar 2 movie ticket rates higher in major cities

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 సినిమా ట్రైలర్ మంగళవారం రిలీజైంది. ది వాటర్ వే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగాన్ని మించిన విజువల్స్ తో తెరకెక్కింది. మన దేశంలో ఇంగ్లీష్ సహా ఏడు భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. డిసెంబర్ 16న విడుదలవుతున్న ఈ చిత్ర టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభయ్యాయి. ప్రధాన నగరాల్లో ప్రముఖ బుకింగ్ సైట్లు థియేటర్ టిక్కెట్ల బుకింగ్ ను స్టార్ట్ చేశాయి.

కానీ ధరలు చూస్తే మాత్రం కళ్లు తేలవేయాల్సిందే. బెంగళూరులో టికెట్ ధర ఏకంగా రూ. 1450 గా ఉంది. ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ కలిగిన థియేటర్ ధర ఇది. పుణెలో రూ. 1200, ఢిల్లీలో రూ. 1000, ముంబయిలో రూ. 970, అహ్మదాబాద్ లో రూ. 750, ఇండోర్ లో రూ. 700గా ఉంది. ఇక హైదరాబాద్ లో ఒక్కో టిక్కెట్ ధర రూ. 350, వైజాగ్ లో రూ. 210 గా ఉంది. ఈ ధరలన్నీ సాధారణ స్క్రీన్లకు సంబంధించినవయితే వీటికి పన్నులు, నెట్ ఛార్జీలు అదనం. అయితే అవతార్ లాంటి విజువల్ వండర్ ని త్రీడీలో పెద్ద తెరమీద చూస్తే ఆ అనుభూతే వేరని అభిమానులు అంటున్నారు. ధర కొంత ఎక్కువయినా పర్లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక సాధారణ థియేటర్లలో బుకింగ్స్ త్వరలోనే ప్రారంభమవుతాయని సమాచారం.