Avatar 2 movie trailer release
mictv telugu

డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల.. లేటెస్ట్ ట్రైలర్ ఇదిగో

November 2, 2022

అవతార్ సినిమాతో పండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్ కామెరూన్ ఇప్పుడు అవతార్ 2తో మరో ఊహా ప్రపంచంలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పిటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 16న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం లేటెస్ట్ 3డీ ట్రైలర్ విడుదల చేసింది. అవతార్.. ది వే ఆఫ్ వాటర్ పేరిట రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160 భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఆ రకంగానూ రికార్డు క్రియేట్ చేసింది. రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సీక్వెల్‌లో శామ్ వర్దింగ్టన్, జో సల్దానా, కేట్ విన్ స్లెట్ తదితరులు నటించారు. మొదటి భాగాన్ని 1961 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా, రూ. 24 వేల కోట్లను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మరి రెండో భాగం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి. కేవలం తెలుగులోనే ఈ చిత్రం రూ. వంద కోట్ల బిజినెస్ చేస్తుందంటే ఈ చిత్రానికి ఉన్న హవాని అర్ధం చేసుకోవచ్చు.

https://twitter.com/Aravinth_82/status/1587781539462463489?s=20&t=p_ik6uqj8Cdh-B2215UMKA