160 భాషల్లో అవతార్- 2 విడుదల..మేకర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

160 భాషల్లో అవతార్- 2 విడుదల..మేకర్స్

April 27, 2022

‘అవతార్’ సినిమా గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 2009లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద 25 బిలియన్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, రికార్డ్ సృష్టించింది.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని గతంలోనే డైరెక్టర్ జేమ్స్ ప్రకటించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అవతార్ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ అవతార్ 2 సినిమాను 2020లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆలస్యం కావడంతో అవతార్ 2 సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

ఈ క్రమంలో ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. తాజాగా అవతార్ 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 160 బాషల్లో విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.