జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సీక్వెల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. డిసెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లోనే ఏకంగా రూ. 7 వేల కోట్లను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట డివైడ్ టాక్ వచ్చినా రోజుల వ్యవధిలోనే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ మొదలైంది. ఒక్క ఇండియాలోనే రూ. 300 కోట్ల మార్క్ ని చేరుకుంది ఈ చిత్రం. కానీ, భారత్ నుంచి రూ. 500 కోట్లు వస్తాయని అంచనా వేసినట్టు తెలుస్తోంది. కానీ రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 4.50 లక్షల బుకింగ్స్ ని పొందింది.
భారత సినీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి. అటు తాజా కలెక్షన్లతో పది రోజుల్లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఐదో చిత్రంగా అవతార్ సీక్వెల్ నిలిచింది. కాగా, 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 16,500 కోట్లు సాధించాల్సి ఉంది. అయితే ఇప్పుడు టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉందని భావిస్తున్నందున వాటిని తగ్గిస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని, దాంతో సంక్రాంతి వరకు కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఓ అంచనా. అటు పలు భాషల్లో ఓటీటీ వల్ల కూడా భారీ ఆదాయాన్ని ఆశిస్తోంది కామెరూన్ టీం.
ఇవి కూడా చదవండి :
పవన్ కళ్యాణ్ పేరు తెలీదు అన్నోడే.. పడిగాపులు కాసాడు..!
పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా సోహెల్ ?