ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న జేమ్స్ కామెరాన్ అద్భుత దృశ్యకావ్యం ‘అవతార్ 2.. ద వే ఆఫ్ వాటర్’ను జనం థియేటర్లలో ఎగబడి చూస్తున్నారు. మరికొందరు దొంగచాటుగా చూస్తున్నారు. విడుదలకు ముందే పైరసీ బారినపడిన ఈ మూవీని ఎవరో యూట్యూబ్లోకి తోసిపారేశారు. కొన్ని గంటల కిందటే యూట్యూబ్లోకి దూసుకొచ్చి ఈ నీలి మనషులు చిత్రం హిందీ వర్షన్. థియేటర్లో రికార్డు చేసినట్లు కనిపిస్తోంది. 38వేల మంది దీన్ని చూసినట్లు లెక్కలు చెబున్నాయి. దీన్ని వీక్షిస్తున్న జనం నానా కామెంట్లు పెడుతున్నారు. నాసిగా ఉన్నా, థియేటర్లకు వెళ్లి చూడలేని వాళ్లు త్వరగా చూడాలని, కాపీరైట్ కింద కాసేపట్లోనే తీసేస్తారని అంటున్నారు.