హైదరాబాద్‌లో అవతార్ స్టూడియో - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో అవతార్ స్టూడియో

October 28, 2017

చార్ సౌ సాల్ పురానా శహర్‌లో షాన్‌దార్ స్టూడియో రాబోతోంది. ‘అవతార్’ సినిమాతో మరో ప్రపంచాన్ని సృష్టించిన హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ హైదరాబాద్‌లో స్టూడియో పెడుతున్నాడు.

నాలెడ్జ్ సిటీలో త్వరలో నిర్మించే IMAGE TOWER [Innovation in Multimedia, Animation, Gaming and Entertainment]లో అత్యాధునిక VFX స్టూడియో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాడు. చార్మినార్, సైబర్ టవర్స్ తర్వాత మోస్ట్ ఐకానిక్ స్ట్రక్చర్‌గా ఉండబోయే IMAGE TOWERను 6 లక్షల చదరపు అడుగుల్లో, 450 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వం నిర్మించనుంది. పోయినేడాది నవంబర్‌లో ఇమేజ్ టవర్స్‌ మోడల్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

టెర్మినేటర్, రాంబో,  టైటానిక్, అవతార్, స్పైడర్ మాన్‌తో పాటు ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్ ప్రారంభించే స్టూడియోతో యానిమేషన్, విజువల్స్ గ్రాఫిక్స్ రంగంలో హాలీవుడ్ రేంజ్‌కు హైదరాబాద్ చేరుతుంది.