Avatar The Way Of The Water: Netizens react as Avatar 2 trailer screens in theatres ahead of Doctor Strange 2
mictv telugu

‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ వచ్చేసింది

May 6, 2022

ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2’. హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’ కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’గా టైటిల్ పెట్టారు.

ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను (ఈ రోజు) శుక్రవారం ‘డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ సినిమాతో పాటు ప్రదర్శించారు. ‘డాక్టర్…’ సినిమా త్రీడీ లో ప్రదర్శితమైన థియేటర్లలో ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ ను కూడా త్రీడీలోనే రూపొందించడంతో ప్రేక్షకుల థ్రిల్ ఫీలయ్యారు. వెండితెరపై ‘అవతార్-2’ ట్రైలర్ ను చూడగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.