షావర్మాపై నిషేధం.. మేయర్ ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

షావర్మాపై నిషేధం.. మేయర్ ఆదేశం

May 10, 2022

ఫాస్ట్‌ఫుడ్‌ను ముఖ్యంగా అందులో షావర్మాను ఎక్కువగా తినే భోజనప్రియులకు షాక్. యువత ఎంతో ఇష్టంగా తినే షవర్మాను తమ మున్సిపాలిటీ పరిధిలో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు వెల్లూర్ జిల్లా గుడియాథం మేయర్. షావర్మా ఆరోగ్యానికి హాని చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ సౌందరరాజన్ తెలిపారు.

ఇటీవల(మే 1న) కేరళలోని కాసర్ గోడ్ లో షావర్మా తిని.. 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం…షావర్మాను తినకుండా ఉండాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రజలకు సూచించారు. ఈ క్రమంలోనే గుడియాధం మున్సిపాలిటీ.. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ సోమవారం సమావేశపరిచి.. షవర్మాపై నిషేధం విధించాలని నిర్ణయించింది. షావర్మాను అత్యధిక ఉష్ణోగ్రత గల మన దేశంలో సరైన విధంగా నిల్వ చేయకపోతే సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.