నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు, జాయింట్ పేయిన్స్ తో బాధపడుతున్నారు. వీటన్నింటికి కారణంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట ఆహారం ఎక్కువగా తినడం..నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే మనం తీసుకునే కొన్ని ఆహారపదార్థాలు కూడా ఆర్థరైటిస్ ను తీవ్రతరం చేస్తాయి. కొన్ని ఆహారపదార్థాల వినియోగం కీళ్ల మధ్య జిగురు పదార్థాన్నితగ్గిస్తుంది. అలాగే కొన్ని ఆహారాలు కాల్షియం లోపానికి కారణమవుతాయి. ఇవి మోకాలి నొప్పిని పెంచుతుంది. కాబట్టి, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. టమోటాలు
టొమాటోలు వంటి నైట్రేట్-రిచ్ ఫుడ్స్ మీ మోకాలి నొప్పిని మరింత తీవ్రం చేస్తాయి. టొమాటోలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కీళ్ల మధ్య అంతరం పెరిగి మంటను కలిగిస్తుంది.
2. సోయాబీన్
సోయాబీన్ మీ మోకాలి నొప్పికి కారణం అవుతాయి. అంతేకాదు సోయాబీన్స్ అధికంగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణమవుతుంది.
3. పాస్తా
పాస్తా కీళ్లకు సమస్యలను కలిగిస్తుంది. వాస్తవానికి, పాస్తాను గోధుమ నుండి తయారు చేస్తారు, ఇందులో గ్లూటెన్ ఉంటుంది, ఇది కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. గోధుమలతో పాటు, బార్లీ, రైలో కూడా గ్లూటెన్ ఉంటుంది, కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.
4. వేయించిన ఆహారాలు
వేయించిన ఆహారాలు కీళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. ఇది మోకాలి ఒత్తిడికి కారణం కావచ్చు. ఈ ఆహారాల వినియోగం శరీరంలో యూరిక్ యాసిడ్‌ను కూడా పెంచుతుంది. మోకాళ్ల నొప్పులను కలిగిస్తుంది.
5. చక్కెర ఆహారాలు
కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు, ఫ్రక్టోజ్, సోడా ,పండ్లతో చేసిన ప్రాసెస్డ్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. ఇది మోకాలి నొప్పిని చాలా త్వరగా పెంచుతుంది. మీరు నడవడానికి కూడా కష్టంగా మారుతుంది.