Axar Patel Registers Massive India Record, Eclipses Jasprit Bumrah To Take Top Spot
mictv telugu

బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్..

March 14, 2023

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్పిన్నర్లలో అక్షర్ పటేల్ ఒకడు. బ్యాటింగ్ లో రాణించినా బౌలింగ్ లో మాత్రం నిరాశపరిచ్చాడు. సిరీస్‌లో తోటి స్పిన్లర్లు జడేజా, అశ్విన్ రెండు డజన్ల దగ్గర వికెట్లు తీసినా అక్షర్ మాత్రం కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.

ఇందులో రెండు వికెట్లు నాలుగో టెస్టులో తీసినవే ఉన్నాయి. అయితే బ్యాటింగ్ మాత్రం ఇరగదీశాడు. సిరీస్‌లో అత్యధిక పరుగుల చేసిన వారి జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. ఉస్మాన్ ఖావాజా (333), విరాట్ కోహ్లీ (297) తర్వాత అక్షర్ (264 ) ఉన్నాడు.

అక్షర్ పటేల్ నాలుగో టెస్ట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున టెస్ట్‌ల్లో 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ విషయంలో బుమ్రాను వెనక్కు నెట్టాడు. బుమ్రా 2,465 బంతుల్లో 50 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ 2,205 బంతుల్లోనే ఈ మార్క్‌ను చేరుకున్నాడు.

నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ (90) ఔట్ చేశాక ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్లల్లో అక్షర్‌ పటేల్ ది(2,205 బంతుల్లో) మొదటి స్థానం కాగా, జస్ప్రీత్‌ బుమ్రా – (2,465 బంతుల్లో) రెండు, భారత మాజీ ఆటగాడు కర్సన్ ఘావ్రి (2,534 బంతుల్లో) మూడు, రవిచంద్రన్‌ అశ్విన్‌ (2,597 బంతుల్లో) నాలుగో స్థానంలో ఉన్నాడు.