‘అయోధ్య’ నాదే అంటున్న హైదరాబాదీ - MicTv.in - Telugu News
mictv telugu

‘అయోధ్య’ నాదే అంటున్న హైదరాబాదీ

November 1, 2017

అయోధ్య వివాదానికి మరో గొడవ తోడైంది. వివాదాస్పద బాబ్రీ మసీదు-రామ జన్మభూమి స్థలం తనదేనని యాకూబ్‌ హబీబుద్దీన్ అనే వ్యక్తి  కోర్టుకెళ్తానంటున్నాడు.

దీనికి పక్కా ఆధారాలున్నాయంటున్నాడు. మొగల్ వంశ చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్‌కు తాను వారసుడినని, అప్పట్లో ఈ స్థలం మొగలులదే కనుక దాన్ని తనకే అప్పగించాలని వాదిస్తున్నాడు. దీనికి సంబంధించి డీఎన్ ఏ నివేదిక తన వద్ద ఉందని చెబుతున్నాడు. ‘బాబ్రీ మసీదు బాబర్ కట్టాడు. కనుక బాబర్ వంశీయుడినైనా నాకే అది దక్కాలి. నన్ను యూపీ సున్న వక్ఫ్ బోర్డు దీనిపై ప్రకటన చేయాలి. నన్ను ముతవల్లీ(హోదా)గా ప్రకటిస్తే నేను కోర్టుకెళ్లి ఈ స్థలం కోసం పోరాడతాను’ అని యాకూబ్ చెప్పాడు. అయితే బాబ్రీ మసీదును హిందూత్వ వాదులు కూలగొట్టినప్పుడు మీరేం చేశారని విలేకర్లు అడగ్గా సమాధానం దాటవేశాడు. యాకూబ్ ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు.