అయోధ్య ముహూర్తం 32 సెకన్లే.. షెడ్యూలు ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య ముహూర్తం 32 సెకన్లే.. షెడ్యూలు ఇలా.. 

August 4, 2020

Ayodhya bhoomi pujan schedule.

అయోధ్యలో రామాలయ భూమిపూజ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ భూమి పూజ సంభంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమిపూజ ముహూర్త సమయం కేవలం 32 సెకండ్లు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. 32 సెకండ్లలోనే మోదీ భూమిపూజ పూర్తి చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు ముహూర్తం ప్రారంభమై, 12 గంటల 44 నిమిషాల 40 సెక్షన్లకు పూర్తవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు హాజరుకానున్నారు. వారిలో 135 మంది వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు ఉన్నారు. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్‌దాస్ మహరాజ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే వేదికపై ఉంటారు. భూమి పూజకు ఆహ్వానించిన వారే అయోధ్యకు రావాలని సీఎం యోగి ఆదిత్యనాధ్‌ విజ్ఞప్తి చేశారు. యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం అందలేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగించనున్నారు.

 

ప్రధాని రామందిర భూమి పూజ షెడ్యూలు..

 

* బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 

* 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ లక్నో నుంచి అయోధ్యకు బయలు దేరతారు.

* 11.30లకు అయోధ్య చేరుకుంటారు.

* 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు.

* 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారు.

* మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి చేరుకుంటారు. 

* మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగుతుంది. 

* మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 

* 2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.