అయోధ్య భూమిపూజ తొలి ఆహ్వానం ముస్లింకు.. - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య భూమిపూజ తొలి ఆహ్వానం ముస్లింకు..

August 3, 2020

Ayodhya dispute litigant musilm Iqbal Ansari gets first invite for bhoomi pujan.

అయోధ్యలో రామమందిర భూమిపూజకు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి. 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాగే ఈ కార్యక్రమం కోసం హిందూత్వ సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయోధ్యలో మతసామరస్యం వెల్లివిరిసే చర్యలు కూడా తీసుకుంటున్నాయి. భూమిపూజకు రావాలని నిర్వాహకులు తొలి ఆహ్వానాన్ని ఓ ముస్లింకు అందించారు. అతడెవరో కాదు, అయోధ్యలోని వివాదాస్పద స్థలం ముస్లింలకే దక్కాలి పోరాడిన ఇక్బాల్ అన్సారీ!

దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందడం ఆ శ్రీరాముడి కోరిక అనుకుంటాను. దీన్ని మనసారా స్వీకరిస్తున్నాను..’ అని అన్సారీ చెప్పారు. ఇక్బాల్ అన్సారీని అయోధ్యలోని హిందూ సాధుసంతులు స్నేహితుడిగా భావిస్తారే. హోలీ వేడుకల్లో ఆయనకు రంగలు పూస్తుంటారు. కేసు కేసే, స్నేహం స్నేహమే అని ఆయన కూడా నవ్వుతూ చెబుతుంటారు. కాగా  భూమిపూజకు మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ముఖయ అతిథులుగా హాజరవుతారు. అద్వానీతోపాటు పలువురు నేతలకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల రద్దీకి చోటు లేకుండా కేవలం 180 మంది మాత్రమే హాజరు కానున్నారు.