‘పత్రాలు చూపనోళ్లు రాముడి ఆధారాలు అడుగుతున్నారు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘పత్రాలు చూపనోళ్లు రాముడి ఆధారాలు అడుగుతున్నారు’

February 29, 2020

lord ram.

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా సాగుతున్న గొడవలోకి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అయోధ్య అంశాన్ని లాక్కొచ్చారు. ‘డాక్యుమెంట్లు చూపనోళ్లు శ్రీరాముడి ఉనికికి ఆధారాలేంటి అని అడుగుతున్నారు’ అంటూ వ్యంగ్యబాణం సంధించారు. 

రాముడు అయోధ్యలో పుట్టాడన్నది వేల ఏళ్ల నాటి విశ్వాసమని, దీన్ని కొందరు దురుద్దేశాలతో ప్రశ్నిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఎన్పీఆర్(జాతీయ జనాభా పట్టిక) కోసం ప్రభుత్వం డాక్యుమెంట్ల చూపాలని అడిగితే కొందరు వ్యతిరేకిస్తున్నారు. వాటిని చూపేది లేదని తేల్చిచెబుతున్నారు. అలా అంటున్న వాళ్లే అయోధ్యలో రాముడి ఉనికి ఆనవాళ్లు చూపించమంటున్నారు..’ అని ఆయన అన్నారు. అయోధ్యలో ధ్వంసం చేసిన కట్టడం ఉన్న ప్రాంత రామజన్మభూమి అని సుప్రీం కోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.