అయోధ్య భూమిపూజ.. ముగ్గురికే అధికారిక ఆహ్వానం! - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య భూమిపూజ.. ముగ్గురికే అధికారిక ఆహ్వానం!

August 3, 2020

Ayodhya Ram Temple Bhoomi Pujan Invitation

అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. అతి కొద్ది మంది అతిథుల సమక్ష్యంలో మాత్రమే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు అధికారిక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ కార్డుపై కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చేర్చారు. కాషాయ రంగులో, బాలరాముడి చిత్రంతో దీన్ని తయారు చేశారు. భూమి పూజ వివరాలను, ఆహ్వానించే వారి పేర్లను అందులో ముద్రించారు. 

ఈ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లు ఉన్నాయి. ట్రస్ట్ చైర్మన్ మంత్ నృత్యగోపాల్ దాస్ వారిని ఆహ్వానిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇందులో ప్రధాని మోదీ భూమి పూజ చేస్తుండగా.. మోహన్ భగవత్ విశిష్ట అతిథిగా ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఆహ్వాన పత్రికను దాదాపు 150 మందికి పంపించారు.