Ayodhya Ram temple completion date
mictv telugu

అయోధ్య రాముడి దర్శనం ఆ నెల నుంచి… ట్రస్ట్ వెల్లడి

August 13, 2022

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూర్తిగా రాతితో నిర్మిస్తున్న ఈ ఆలయం కోసం దశాబ్దాల నుంచే శిల్పాలు చెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందన్న దానిపై అయోధ్య ట్రస్ట్ కొన్ని వివరాలు వెల్లడించింది. వచ్చే ఏడాది(2023) డిసెంబర్ నాటికల్లా పనులు పూర్తయి శ్రీరాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. ఆలయ పనుల్లో ఇనుమును అసలు వాడడడం లేదని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ‘‘వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో స్వామి దర్శనానికి రావాలని మిమ్మల్నందర్నీ ఆహ్వానిస్తున్నాను. సంప్రదాయ వాస్తులో గుడిని అద్భుతంగా నిర్మిస్తున్నాం..’ అని ఆయన అయోధ్యకు దగ్గర్లోని సుల్తాన్‌పూర్ జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో ట్రస్ట్ నిర్మాణం ప్రారంభించడం తెలిసిందే. 2.77 ఎకరాల విస్టీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో గుడి నిర్మిస్తున్నారు. ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు 20 అడుగులతో, మొదట 160, మొదటి అంతస్తులో 160 ,రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు సాగుతున్నాయి.