రామ మందిరానికి శిల్పాలు సిద్ధం.. ప్రత్యేకతలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

రామ మందిరానికి శిల్పాలు సిద్ధం.. ప్రత్యేకతలు ఇవే

August 2, 2020

Ayodhya Temple Columns.

అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరానికి ఎంతో ఖ్యాతి తెచ్చే విధంగా శిల్పకళలను జోడిస్తున్నారు. ఆలయంలో స్తంబాలకు శిల్పాలు చిక్కించి వాటిని నిర్మాణ సమయంలో పొందు పరచనున్నారు. ఒకటో అంతస్థు వరకు అవసరమైన శిల్పాలు ఇప్పటికే సిద్ధం చేసినట్టు శిల్పాలు చెక్కే వర్క్‌షాప్ కేర్‌టేకర్ హనుమాన్ యాదవ్ వెల్లడించారు. వివిధ రకాల బొమ్మలను వీటిపై చిక్కినట్టుగా తెలిపారు.

ఈ స్తంబాల కోసం ఇసుకరాయిని ఎంపిక చేసుకున్నారు. వేలాది ఏళ్ల పాటు దిట్టంగా ఉంటుందని తెలిపారు. దీంతో పాటు రామాలయం అవసరాలకు అనుగుణంగా శిల్పాలను అతి సూక్ష్మంగా చెక్కినట్లు తెలిపారు.ప్రక్షాళన పనులు ఇప్పటికే పూర్తి కావడంతో  శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశం తర్వాత మిగితా పనులు పూర్తి చేస్తామని అన్నారు. మొదటి అంతస్తు వరకు కావాల్సినన్ని రాతి స్తంబాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కాగా ఈ స్టోన్ కార్వింగ్ వర్క్‌షాపును వీహెచ్‌పీ 1990 సంవత్సరంలో ఏర్పాటు చేసింది.